పోస్ట్‌లు

గుహాలయాల నుండి గోపురాల వరకు : దక్షిణ భారత శిల్పకళా పరిణామం

చిత్రం
ప్రచురణ: ఓరుగల్లు అందాలు    తొలిపలుకు ఆధునిక ప్రపంచపు హడావుడి వెనుక, కాలం దాచేసిన ఒక నిశ్శబ్ద చరిత్ర ఉంది. మనం చూసే శిథిలాలు, విస్మరణకు గురైన ఆలయాలు... కేవలం రాళ్లు రప్పలు కావు, వాటి వెనుక శతాబ్దాల రహస్యాలున్నాయి. ఒకప్పుడు అవి సామ్రాజ్యాల గుండె చప్పుడు. నాటి అద్భుత సాంకేతికతకు, శిల్పకళా వైభవానికి నిలువెత్తు సాక్ష్యాలు. ఆనాటి సజీవమైన గతాన్ని నేటి తరానికి అందించడమే నా ముఖ్య ఉద్దేశం. కాకతీయుల రాజధాని ఓరుగల్లులో పుట్టిన నాకు, ఏ గ్రామంలో చూసినా ఒక దేవాలయం, ఆనాటి శిల్పాల శిథిలాలు కనిపిస్తూ ఉండేవి. వాటిని చూసినప్పుడల్లా నాలో ఒక జిజ్ఞాస పెరుగుతూ వచ్చింది. అసలు ఈ శిల్పకళ ఎప్పుడు, ఎలా అభివృద్ధి చెందింది? ఆ ఆలోచనకు సమాధానమే ఈ రచన. రండి, సవివరంగా తెలుసుకుందాం! మొదటి గుడి: గుడిమల్లం శ్రీ పరశురామేశ్వరాలయం ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా నిర్మించబడిన తొలి గుడి లేదా తొలి శిల్పం... తిరుపతి దగ్గర్లోని శ్రీకాళహస్తి మండలం గుడిమల్లంలో ఉన్న శ్రీ పరశురామేశ్వరాలయం. దక్షిణ భారత వాస్తు లేదా శిల్ప చరిత్ర ఇక్కడే మొదలైంది. ఈ శిల్పం సుమారు 2300 ఏళ్ల నాటిదని పురావస్తు శాస్త్రవేత్తల అంచనా. అంటే ఆర్యుల కంటే ముందు ...